శివరాత్రి నాడు విషాదం.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పన్నెండు మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేళ విషాదం నెలకొంది. రెండురాష్ట్రాల్లో ఒకే రోజు పన్నెండు మంది మరణించారు
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేళ విషాదం నెలకొంది. రెండురాష్ట్రాల్లో ఒకే రోజు పన్నెండు మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో పది మంది, తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి మరణించారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు వద్ద గోదావరిలో పడి ఐదుగురు మరణించారు. మృతి చెందిన వారంతా విద్యార్థులే కావడం గమనార్హం. ఏలూరు జిల్లాలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
పుణ్యస్నానాలకు వెళ్లి...
శ్రీశైలం పాతాళగంగలో తండ్రీ కొడుకులు పుణ్యస్నానాలకు వెళ్లి మునిగి మరణించారు. కొడుకును కాపాడపోయిన తండ్రి కూడా ఈ ఘటనలో మరణించారు. అలాగే తెలంగాణలోనూ మరో ఇద్దరు స్నానాలకు వెళ్లి మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఒకే రోజు ఏపీ, తెలంగాణాలో పన్నెండు మంది మరణించడంతో శివరాత్రి రోజు విషాదం నెలకొంది.