ఏపీలో ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి
కడప జిల్లాలో విషాదం నెలకొంది. ఏనుగుల దాడిలో ఐదుగురు మరణించారు.
కడప జిల్లాలో విషాదం నెలకొంది. ఏనుగుల దాడిలో ఐదుగురు మరణించారు. కడప జిల్లా ఓబులవారి పల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల గుంపు భక్తులపై దాడిచేసింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు భక్తులు గాయాలపాలయినట్లు సమాచారం అందుతుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఆలయానికి వెళుతుండగా...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వై. కోటకు చెందిన భక్తులు అన్నమయ్య జిల్లాలో గుండాల కోన ఆలయానికి కాలినడకన వెళుతుండగా ఏనుగులు ఒక్కసారిగా వచ్చి దాడికి దిగాయి. ఈ హటాత్పరణానికి భక్తులు పరుగులు తీశారు. అయితే ఏనుగులు ఐదుగురిని తొక్కిచంపేశాయి. దీంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.