టీడీపీ ఎమ్మెల్సీ ఇంట విషాదం
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఇంట విషాదం నెలకొంది. సి. రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మరణించారు
satyanarayana passed away
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఇంట విషాదం నెలకొంది. సి. రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మరణించారు. సిఆర్ కుమారుడు విష్ణు స్వరూప్ వయసు 44 సంవత్సరాలు. శనివారం ఆయన గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లో గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విష్ణు స్వరూప్ చనిపోయారని వైద్యులు తెలిపారు.
గుండెపోటు రావడంతో...
టీ తాగుతుండగా గుండెనొప్పి అనడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విష్ణు స్వరూప్ మరణించారు. ఆయన భౌతిక కాయాన్నికడపలోని ఆయన ఇంటికి తీసుకురానున్నారు. విశ్వస్వరూప్ గ్రానైట్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి నేడు కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుమారుడు మరణించడంతో సి. రామచంద్రయ్య కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళి పరామర్శించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now