Tirumala : నేడు తిరుమలలో రద్దీ పెద్దగా లేదు.. కారణం ఏంటంటే?

తిరుమలలో నేడు రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల రద్దీ తిరుమలలో తగ్గింది.

Update: 2023-11-28 02:40 GMT

Tirumala

తిరుమలలో నేడు రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల రద్దీ తిరుమలలో తగ్గింది. నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కార్తీక పౌర్ణమి కావడంతో పాటు కార్తీక సోమవారం కావడంతో ఉపవాసాలు ఉండటం కోసం భక్తులు తిరుమలకు పెద్దగా చేరుకోలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. చలిగాలులు వీస్తుండటం, కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం కారణంగా కూడా తిరుమలలో రద్దీ తగ్గిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 58,176 మంది దర్శించుకున్నారు. వీరిలో 20,157 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల దర్వన టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటలు, సర్వదర్శనం క్యూలైన్ లో వెళ్లే వారికి ఎనిమిది గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News