Andhra Pradesh : ఏపీలో యాభై మంది మావోయిస్టులు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు.
chhattisgarh
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. నిన్న మారేడుమిల్లిలో ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాల్లో పెద్దయెత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో యాభై మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోని జిల్లాల్లో...
ఛత్తీస్ గఢ్, ఒడిశా అడవుల్లో కూంబింగ్ అధికం కావడంతో మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ ను షెల్టర్ జోన్ గా తీసుకున్నారని పోలీసులు చెబుతన్నారు. ఒక్క కృష్ణాజిల్లా పెనమలూరులో 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15 మంది, విజయవాడలో నలుగురు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు మావోయిస్టుల అరెస్ట్‌లపై పోలీసుల మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు.