రేపు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్.. మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు

రేపు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్.. మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు

Update: 2025-04-18 06:41 GMT

మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. టెలి కాన్ఫరెన్స్ కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛఆంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి,అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు హాజరయ్యారు. గత నాలుగు నెలలుగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

మూడో శనివారం...
ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న నారాయణ రేపు ఇ - చెక్ అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. షాపులు ,ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పూర్తిగా సేకరించాలని, మున్సిపాలిటీల్లో ఉన్న ఆర్ఆర్ఆర్ సెంటర్లను ఈ కలెక్షన్ సెంటర్లుగా మార్చి మెప్మా మహిళలకు అప్పగించాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని, దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు వెళ్ళాలని, ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ప్రాంతాలలోనూ స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని కోరారు.


Tags:    

Similar News