టమాటా ఇంత రేటా?

టమాటా రైతుకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. కిలో యాభై పైసలు అమ్ముడవుతుంది. దీంతో రైతులు రోడ్డు మీదనే పడేస్తున్నారు

Update: 2022-11-10 04:22 GMT

టమాటా రైతుకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. కిలో యాభై పైసలు అమ్ముడవుతుంది. దీంతో మార్కెట్ కు తెచ్చేకంటే రోడ్డు మీదనే పడేస్తున్నారు రైతులు. పత్తికొండ మార్కెట్ లో కిలో టమాటా యాభై పైసలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. మొన్నటి వరకూ ధర బాగా పలకడంతో రైతుకు కొంత ఆదాయం వచ్చింది. అయితే టమాటా దిగుబడి ఎక్కువగా పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు ఎక్కువ కావడంతో టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది.

బహిరంగ మార్కెట్ లో...
ఇక రైతుకు మార్కెట్ లో యాభై పైసలకు కిలో లభిస్తుంటే, వినియోగదారులకు మాత్రం వ్యాపారులు అధిక ధరలకు అంటగడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో ముప్ఫయి రూపాయలు టమాటా పలుకుతుండం విశేషం. ఇటు రైతు, అటు వినియోగదారులు నష్టపోతుంటే మధ్య దళారులు, వ్యాపారులు మాత్రం లాభం పొందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.


Tags:    

Similar News