Andhra Pradesh : వైసీపీ నేడు వెన్నుపోటు దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంది. వెన్నుపోటు దినోత్సవాన్ని జరపాలని జగన్ పిలుపు నివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఈరోజుకు ఏడాది అవ్వడంతో నేడు విద్రోహ దినంగా జరపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను...
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో ప్రజలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచినట్లు భావించి నిరసనలు తెలియజేయాలని కోరారు. అధికారులకు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్లి డిమాండ్ తో కూడిన పత్రాలను అందచేయాలని కోరారు. దీంతో నేడు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.