నేడు రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు
నేడు రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయింది.
నేడు రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయింది. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను నేతలు వివరించనున్నారు. నిన్నటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం కావడంతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.
నేడు కూడా కుప్పంలోనే చంద్రబాబు
ఏడాదిలో ఏం చేశాం.. భవిష్యత్‍లో ఏం చేస్తామనే అంశాలపై ప్రజలకు వివరణ ఇస్తున్నారు. కరపత్రాల ద్వారా ప్రజలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివరించనున్నారు. కాగా నేడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటింటికీ తిరుగుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం అమరావతికి చేరుకుంటారు.