నేడు వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ

నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేయనుంది.

Update: 2025-02-28 03:53 GMT

నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేయనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు సత్యవర్ధన్ ను బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపేందుకు మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కూడా అప్పగించింది.

మూడు రోజుల కస్టడీ...
మూడు రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి పోలీసులు విచారణ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అని న్యాయమూర్తి అడగగా, అందుకు వంశీ అలాంటిదేమీ లేదని చెప్పారు. తనను జైల్లో ప్రత్యేక బరాక్ లో ఉంచారని, తనకు ఆస్తమా ఉందని, వేరే వారితో కలసి ఉంచాలని వల్లభనేని వంశీ కోరగా పిటీషన్ వేయాలని, పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.


Tags:    

Similar News