Chandrababu : నేడు అమరావతిలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
నేడు అమరావతిలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నారు.
నేడు అమరావతిలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఐదు ఎకరాలు ఇంటి కోసం భూమిని కొనుగోలు చేశారు. నేడు శుభదినం కావడంతో ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించనున్నారు.
సచివాలయం వెనకే....
నూతన రాజధానిలో చంద్రబాబు తన ఇంటిని నిర్మించుకోవాలని ఆయన నిర్మించారు. ఇందుకోసం అన్ని వసతులు ఉండేందుకు ఐదు ఎకరాల స్థలంలో ఇంటిని నిర్మించనున్నారు. సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణాన్ని చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు వెలగపూడి గ్రామస్థులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.