Mahanadu : నేడు మహానాడు ముగింపు సభ

నేడు తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరగనుంది, ముగింపు రోజు కావడంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు

Update: 2025-05-29 02:24 GMT

నేడు తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరగనుంది. మూడో రోజు జరగనున్న ఈ మహానాడులో నారా లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మూడో రోజు మహానాడులో పలు అంశాలపై చర్చించి కడప వేదికగా ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులపై నేడు మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల విషయంలో తన వైఖరిని కూడా కుండబద్దలు కొట్టనున్నారు.

మూడో రోజు భారీ బహిరంగ సభ
నేడు ముగింపు రోజు కావడంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. దాదాపు ఐదు లక్షల మంది ఈ బహిరంగ సభకు వస్తారని అంచనా వేసి అందుకు తగినట్లుగా నిర్వాహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముగింపు సభ అదిరిపోయేలా ఉండేలా అన్ని ఏర్పాట్లను నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. అందరికీ భోజనాలు, మంచినీటి వసతిని కల్పించనున్నారు. నేటితో ముగియనుండటంతో నేటి మహానాడులో చంద్రబాబు ప్రసంగం కీలకంగా మారనుంది.


Tags:    

Similar News