Visakha Mlc Elections : నేడు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్
నేడు విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు.
botsa satyanarayana, mlc ycp candidate, visakha, nomination
నేడు విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమం తర్వాత కార్పొరేటర్లు, కొందరు ఎంపీటీసీలను క్యాంప్‌నకు తరలించనున్నారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును చాలా రోజుల క్రితమే వైఎస్ జగన్ ఖరారు చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు. విశాఖ ప్రాంతంలో పట్టున్న బొత్స సత్యనారాయణను ఎంపిక చేయడం ద్వారా అధికార పార్టీకి జగన్ చెక్ పెట్టగలిగారు.
బలం మాత్రం...
అయితే ఇప్పటికే అత్యధిక మంది ఓటర్లు వైసీపీ వైపు ఉన్నారు. దాదాపు 615 ఓటర్లు వైసీపీ వైపు ఉండగా, సుమారు 250 మంది వరకూ టీడీపీకి అనుకూల ఓటర్లున్నారు. దీంతో టీడీపీ ఇప్పటి వరకూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అందరినీ బెంగళూరు క్యాంప్ కు తరలించనున్నారు. ఇప్పటికే కొందరిని బెంగళూరుకు తరలించారు. ఆగస్టు 30వ తేదీన పోలింగ్ జరుగుతుండటంతో ఆరోజు క్యాంప్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకు వచ్చే అవకాశముంది.