Andhra Pradesh : నేడు రాజంపేట బంద్
నేడు ఆంధ్రప్రదేశ్ లో రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బంద్ ను నిర్వహిస్తున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ లో రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బంద్ ను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి బంద్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సులు కూడా బయటకు రావడం లేదు. రాజంపేట, రైల్వే కోడూరులలో బంద్ కొనసాగుతుంది. జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
కొత్త జిల్లా కేంద్రాన్ని...
ఇటీవల ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా రాజంపేట విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంపై జేఏసీ తో పాటు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల జిల్లాలకు చెందిన అన్ని పార్టీల నేతలు ఈ బంద్ లో పాల్గొంటున్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.