నేడు సీపీఎస్ పై సమావేశం

నేడు సీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి వర్తమానం అందింది

Update: 2022-08-18 04:15 GMT

నేడు సీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి వర్తమానం అందింది. ముఖ్యమైన ఉద్యోగ సంఘాలను ఈ చర్చలకు పిలిచింది. సీపీఎస్ ను పునరుద్ధరించాలని గత కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో జగన్ కూడా తన పాదయాత్రలో ఈ మేరకు హామీ ఇచ్చారు. దీంతో ఈరోజు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది.

ఆందోళనలకు పిలుపునివ్వడంతో...
సీపీఎస్ రద్దు పై సెప్టంబరు 1వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే ప్రభుత్వం గతంలో సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ ను ప్రవేశపెడతామని తెలిపింది. దీనిపై ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే ఈరోజు జరిగే చర్చలకు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందంటూ అవి ఆరోపిస్తున్నాయి. అమరావతి సచివాలయంలో నేడు సీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది.


Tags:    

Similar News