నేడు లిక్కర్ స్కామ్ లో నిందితులు నలుగురు సిట్ కస్టడీలోకి
ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీని అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పడంతో నేడు వారిని విచారించనున్నారు.
ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీని అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పడంతో నేడు వారిని విచారించనున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకి నిందితులను ఏసీబీ కోర్టు అనుమతించింది. రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను కలసి ఒకేసారి విచారించాలన్న సిట్ వేసిన పిటీషన్ ను న్యాయస్థానం అంగీకరించింది.
రెండు రోజుల విచారణ....
దీంతో ఈ నలుగురిని కలిపి నేడు మద్యం కేసులో విచారించనున్నారు. నేడు కస్టడీలోకి తీసుకోనున్న సిట్ అధికారులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నలుగురిని విచారించనున్నారు. మద్యం కేసులో మరిన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ విచారణ కీలకమని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.