తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని నేటి నుంచి అమలులోకి రానుంది
తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని నేటి నుంచి అమలులోకి రానుంది. ప్రధానంగా శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు వంటి అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ రికగ్నేషన్ విధానం నేటి నుంచి అమలులోకి వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని చెబుతున్నారు.
ఫేస్ రికగ్నేషన్ నేటి నుంచే...
తిరుమల వెళ్లే భక్తులకు అందించే సేవలలో పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. మంగళవారమే ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ ను అములు చేశారు. ఫేస్ రికగ్నేషన్ చేయిస్తే కాషన్ డిపాజిట్ చెల్లించిన వారే తిరిగి వస్తే వారికే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా దళారీలకు చెక్ పెట్టవచ్చనన్నది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల భావన. మరి తమ కొత్త నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరుతుతున్నారు.