భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2025-04-18 04:39 GMT

bybhumana karunakar reddy

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. గోశాలలో ఆవులు మృతి చెందారని అసత్య ప్రచారం చేశారంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ నేత, టీటీడీ బోర్టు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు భూమన పై కేసు నమోదు చేశారు.

పలు సెక్షన్ల కింద
పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఎస్వీ గోశాలలో దాదాపు వంద గోవులు మరణించాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కూటమి నేతలు విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఆరోపణలు అర్ధరహితమంటూ భూమనపై కేసు నమోదయింది.


Tags:    

Similar News