తిరుపతిలో మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు.. రూ.కోటి విలువైన ఫోన్లు రికవరీ

ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్‌ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్‌ పోయిందంటే..

Update: 2023-12-01 07:09 GMT

ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్‌ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్‌ పోయిందంటే చాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే నమ్మకం ఉండదు. అలాంఇ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయంతో పోగొట్టుకున్నవారి ఫోన్‌లు తిరిగి వారి చేతికి వచ్చేస్తున్నాయి. MOBIEL HUNT (వాట్సాప్‌ నెంబర్‌ 9490617873) అప్లికేషన్ సేవల ద్వారా వాట్సాప్‌కు వచ్చిన ఫిర్యాదులపై గతంలో జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 6 విడతలలో రూ. 2,93,40,000/- విలువ గల 1630 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సదరు బాధితులకు అందించారు.

ప్రసుత్తం 7వ విడతలో గత రెండు నెలల రోజుల వ్యవధిలోనే సుమారు రూ.1.08 కోట్ల విలువ గల 600 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు MOBILE HUNT అప్లికేషన్‌ ద్వారా ఇప్పటి వరకకు రూ.4.1కోట్ల విలువ గల మొత్తం 2230 మొబైల్ ఫోన్లు పోగొట్టుకోగా వాటిని రికవరీ చేశారు తిరుపతి పోలీసులు.

మంచి ఫలితాలు ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు

తిరుపతి తిరుమల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి వెళుతుంటారు. తిరుపతి బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాలలో మొబైల్ పోగొట్టుకోవడమో లేదా దొంగలించడమో జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి 2023-ఫిబ్రవరి నెలలో MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. అలా పోగొట్టుకున్న మొబైల్స్ ను ఒక ప్రక్క రికవరీ చేసి, బాధితులకు అందజేస్తూ, మరో ప్రక్క పిక్ పాకెటర్ల కదలికలపై సిసి కెమేరాలతో ప్రవేక్షిస్తూ, విసిబల్ పోలీసింగ్ ను పెంచి అనుమానితులపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామన్నారు.

మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు ఎలా పొందాలి?

ప్రజల ఎవ్వరిదైనా మొబైల్ ఫోన్ పోతే పోలీసులు ఏర్పాటు చేసిన MOBIEL HUNT 9490617873 నెంబర్ కు WhatsApp లో Hai లేదా HELP అని మెసేజ్ చేస్తే ఓ లింక్‌ వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. లేదా CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది. అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరగా రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసు MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు, CIER పోర్టల్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి, సైబర్ క్రైమ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు.

Tags:    

Similar News