కేంద్ర హోంమంత్రికి వైసీపీ ఎంపీ లేఖ
తిరుమల పరకామణి వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గూరుమూర్తి స్పందించారు.
తిరుమల పరకామణి వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గూరుమూర్తి స్పందించారు. తిరుమల పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. దీనిపై దర్యాప్తు జరపి అసలు నిజాలు తేల్చాలని కోరారు.
ఆధారాలు లేకుండా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా, తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీయాలని చూస్తోందని గురుమూర్తి ఆరోపించారు. ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియను రాజకీయ రంగంలోకి లాగడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. పరకామణి కేవలం డబ్బు లెక్కింపు కాని, ఇది 120 కోట్ల హిందువుల విశ్వాసానికి ప్రతీక అని గురుమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారు.