శ్రీవారి స్పెషల్ దర్శనం కావాలా? అయితే ఈరోజే?
తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది
తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈరోజు ఏప్రిల్ నెలకు సంబంధించిన టిక్కెట్లను భక్తుల కోసం ఆన్ లైన్ లో ఉంచుతారు. రేపు మే నెలకు, ఎల్లుండి జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. మూడు నెలలకు సంబంధించి 25 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది.
మొత్తం 25 లక్షల టిక్కెట్లు.....
సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు ముప్ఫయివేల చొప్పుటన టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచుతారు. గురువారం నుంచి ఆదివారం వరకూ రోజుకు 25 వేల టిక్కట్లను విడుదల చేయాలని టీటీడీ భావిస్తుంది. ఈ టిక్కెట్ల అమ్మకం ద్వారా టీటీడీకి 75 కోట్ల ఆదాయం సమకూరనుంది. కరోనా కారణంగా భక్తులను రెండేళ్ల పాటు పెద్ద సంఖ్యలో అనుమతించలేదు. అయితే కరోనా తగ్గడంతో పెద్ద సంఖ్యలో ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్టను టీటీడీ విడుదల చేయనుంది.