Nara Lokesh : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు

Update: 2026-03-24 04:29 GMT

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)‌‌‌‌‌‌‌ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చానని, కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపామని, . పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించానని చెప్పారు.

ఆర్డీటీ యధాతధంగా...
ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయని, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయిందని లోకేశ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు.. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు కూడా తెలిపారు.


Tags:    

Similar News