Ys Sharmila : మిట్టల్ కు చంద్రబాబు దురంధర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖల్ నాయక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు

Update: 2026-03-24 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. విశాఖ స్టీల్ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మిట్టల్ మీద తల్లి ప్రేమ కురిపించారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది సైలెంట్ కిల్లింగ్ అని వైఎస్ షర్మిల అన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు దురంధర్ అయితే .. వైజాగ్ స్టీల్ కి ఖల్ నాయక్ అని వైఎస్ షర్మిల అన్నారు. ఉగాదికి ఇచ్చింది జాబ్ క్యాలెండర్ కాదని, జోక్ క్యాలెండర్ అన్న షర్మిల కొండంత రాగం తీసి కూసింత పాట పాడారని అన్నారు.

స్టీల్ ప్లాంట్ రావడం...
మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపన హర్షణీయమేనని, ⁠రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయంటే ఎవరు కాదనరనని వైఎస్ షర్మిల అన్నారు. ⁠కానీ మిట్టల్ స్టీల్ కి 25 వేల కోట్ల రాయితీలా? అని నిలదీశారు. 9 శాతం , 15 ఏళ్ల పాటు రాష్ట్ర వాటా కింద GST మినహాయింపులా?అని ప్రశ్నించారు. ఎలక్ట్రిసిటీ కింద యూనిట్ కి 1 రూపాయి రాయితీ ఇస్తారా? అని అన్నారు. ⁠సొంత పోర్ట్ ఇచ్చారని, కావాల్సిన నీళ్లు ఇచ్చారని, ⁠ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకు ఇంత శ్రద్ధ ఉందని, ⁠కానీ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ వైజాగ్ స్టీల్ మీద ఫ్యాక్టరీ మీద ఎందుకు లేదని, అదే ప్రేమను ⁠విశాఖ స్టీల్ మీద పెట్టకపోవడం బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.


Tags:    

Similar News