తిరుమల శ్రీవాణి టిక్కెట్ల జారీలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా?

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

Update: 2025-08-23 07:03 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. శ్రీవాణి టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లు, ఆఫ్‌లైన్‌లో 1000 టిక్కెట్లు జారీ చేస్తుంది. ఆన్‌లైన్‌లో మూడు నెలలు ముందుగా జారీ చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంఆఫ్‌లైన్‌లో ఏరోజుకు ఆరోజు జారీ చేస్తుంది.

భక్తుల అభిప్రాయాల మేరకు...
ఆఫ్‌లైన్‌ టిక్కెట్లకు డిమాండ్‌ ఉండడంతో గంటల తరబడి భక్తులు క్యూలో వేచిఉంటున్నారు. ఆఫ్‌లైన్‌ కోటాను కోటా ఏరోజుకు ఆరోజు ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ అధికారులున్నారు. అయితే దీనిపై భక్తుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశముందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News