విశాఖ శారదాపీఠానికి టీటీడీ ఝలక్
విశాఖ శారదాపీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఝలక్ ఇచ్చింది.
విశాఖ శారదాపీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఝలక్ ఇచ్చింది. తిరుమలలోని విశాఖ శారదాపీఠాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. నోటీసులకు పదిహేను రోజుల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. పది హేను రోజుల్లో భవనానని ఖాళీ చేయడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని కోరింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ ఈ నోటీసులు జారీ చేసింది.
నోటీసులకు స్పందించకుంటే కూల్చివేస్తామంటూ...
వీటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించినట్లు తెలిపింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా శారదాపీఠానికి ఊరట దక్కలేదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అక్రమ నిర్మాణాలను శారదాపీఠం చేపట్టిందని టీటీడీ నిర్ణయించి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఖాళీ చేయకుంటే భవనాన్ని కూడా కూల్చి వేస్తామని టీటీడీ హెచ్చరించింది.