Tirumala : ఇకపై తిరుమలలో ఇది నిషేధం

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఇక రీల్స్ చేసే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర హెచ్చిరికలు జారీ చేసింది

Update: 2025-07-31 11:40 GMT

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఇక రీల్స్ చేసే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర హెచ్చిరికలు జారీ చేసింది. శ్రీవారి ఆలయం ఎదుట, మాడవీధుల్లో కొందరు రీల్స్ చేస్తున్నారని, వెకిలి చేష్టలు చేస్తున్నారని,డ్యాన్స్ లతో కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని అధికారులు తెలిపారు.

ఆపనిచేస్తే చర్యలు...
ఇటువంటి వారిపై ఇక కఠిన చర్యలు తప్పవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హెచ్చరించారు. భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా ఈ రకమైన చర్యలను ఎవరూ సమర్థించరని, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగంకలిగేలా ఇటువంటి చర్యలకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News