Tirumala : తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-07-24 03:45 GMT

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలను దర్శించుకునే వారికి ఆన్ లైన్ లో టిక్కెట్లు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం ఆన్ లైన్ లో పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. అందుకే ఈరోజు ఉదయం పది గంటల నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింద.ి

నేడు విడుదల...
అక్టోబర్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మధ్యహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటాను రిలీజ్ చేయనుంది . https:// ttdevastations.ap.gov.inవైబ్ సైట్ మాత్రమే దర్శనం టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.


Tags:    

Similar News