Tirumala : తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్

తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-07-23 03:12 GMT

తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు ఆన్ లైన్ లో అక్టోబరు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు అంగ ప్రదిక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం పకొండు గంటలకు శ్రీవాణి టిక్కెట్లు విడుదల చేస్తామని తెలిపారు.

దర్శన టిక్కెట్లు...
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. రేపూు ఉదయం పది గంటలకు అక్టోబరు నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News