మరికాసేపట్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విడుదల

నిమిషాల్లో అమ్ముడయిపోయే తిరుమల శ్రీవారి టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Update: 2022-01-28 02:02 GMT

నిమిషాల్లో అమ్ముడయిపోయే తిరుమల శ్రీవారి టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ టోకెన్లను విడుదల చేస్తారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈరోజు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు పన్నెండు వేల చొప్పున ఈ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నారు.

రేపు సర్వదర్శనం.....
రేపటి నుంచి సర్వ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తుంది. సర్వదర్శనం టిక్కెట్లు రోజుకు పదివేలు మాత్రమే విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. కరోనా కారణంగా టిక్కెట్ల కేటాయింపును తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దర్శనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కరోనాను కంట్రోల్ చేయవచ్చని భావిస్తుంది.


Tags:    

Similar News