టీటీడీ ధర్మరథం చోరీ.. ఎక్కడ దొరికిందంటే?

తిరుమలలో భక్తులను ఉచితంగా పలు ప్రాంతాలకు తరలించడానికి శ్రీవారి ధర్మరథం

Update: 2023-09-24 06:13 GMT

తిరుమలలో భక్తులను ఉచితంగా పలు ప్రాంతాలకు తరలించడానికి శ్రీవారి ధర్మరథం ఉపయోగిస్తూ ఉంటారు. భక్తులకు ఉచితంగా గమ్యస్థానాలకు తీసుకుని వెళ్లే ఈ బస్సు చోరీకి గురి అయింది. జీపీఎస్ ఉన్న బస్సు కావడంతో దాని లొకేషన్ ను ఎట్టకేలకు కనిపెట్టగలిగారు అధికారులు. తిరుమలలో మిస్ అయిన బస్సు నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద ఉందని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

తిరుమల కొండపై భక్తుల సేవకు వినియోగించే ఉచిత బస్సులను శ్రీవారి ధర్మ రథాలుగా పిలుస్తారు. ఇలాంటివి మొత్తం 10 ఎలక్ట్రిక్ బస్సులు కొండపై ఉన్నాయి. ఒక్కో బస్సు ఖరీదు 2 కోట్ల రూపాయలు. కొండపై భక్తులకోసం వీటిని వినియోగిస్తున్నారు. తిరుమలలోని టీటీడీ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్యాలయం నుంచి ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఈ ధర్మరథాన్ని చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బస్సు ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మేఘా సంస్థకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి నెలలో టీటీడీకి పది ఎలక్ట్రిక్ బస్సులను కానుకగా ఇచ్చింది.


Tags:    

Similar News