గుడ్ న్యూస్.. మరికాసేపట్లో ప్రత్యేక టిక్కెట్లు విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుంచి ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది

Update: 2022-02-23 02:30 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుంచి ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి ఆన్ లైన్ టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. రోజుకు పదమూడు వేల టిక్కెట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువగా ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోసమే భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

దర్శనాల సంఖ్య....
కానీ కరోనా తీవ్రత నేపథ్యంలో గత రెండేళ్లుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ తగ్గించేసింది. దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు. అయితే నేటి నుంచి ఆన్ లైన్ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విక్రయించనుంది. మార్చి నెలలో రోజుకు 25 వేల చొప్పున మూడు వందల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టిక్కెట్లను రోజుకు ఇరవై వేలు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.


Tags:    

Similar News