తిరుమలలో మొదలైన వీకెండ్ రష్.. క్యూ కాంప్లెక్స్ ఫుల్

ఇక గురువారం 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం..

Update: 2023-07-21 04:00 GMT

tirumala queue complex

ప్రతినిత్యం వేలాది మంది భక్తుల రాకపోకలతో తిరుమలగిరులు రద్దీగా ఉంటాయి. నడకదారిన వెళ్లే భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలతో శ్రీవారి ఆలయం రద్దీగా ఉంటుంది. గోవిందనామ స్మరణతో ఆద్యంతం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇక వీకెండ్ వస్తే.. తిరుమలలో రష్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి.. కాంప్లెక్స్ వెలుపలికి క్యూలైన్లు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

ఇక గురువారం 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 33,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను టిటిడి మరింత సులభతరం చేస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను పొందిన భక్తుల కోసం టీటీడీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన "పే లింక్" ను క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా సొమ్మును చెల్లించి సేవా టికెట్లను పొందవచ్చు.


Tags:    

Similar News