BIG ALERT : ఏపీలో నాలుగు జిల్లాలకు భారీ పిడుగుల హెచ్చరిక

తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్, రేణిగుంట,నారాయణవనం, కెవిబి పురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు ప్రాంతాల్లో..

Update: 2022-05-16 12:37 GMT

రుతుపవనాల ప్రభావంతో ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురవగా.. రోడ్లన్నీ జలమయమై, వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తాజాగా ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూల్ జిల్లాల్లో పిడుగులు పడవచ్చని, ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఇంట్లోనే ఉండాలని తెలిపారు.

తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్, రేణిగుంట,నారాయణవనం, కెవిబి పురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు ప్రాంతాల్లో పిడుగు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే.. చిత్తూరు జిల్లాలోని నగరి, నిండ్ర, విజయపురం గ్రామాల్లో, అన్నమయ్య జిల్లాలోని కురబలకోట, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి, వాయల్పాడు ప్రాంతాల్లో..
కర్నూలు జిల్లాల్లోని చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలంతా సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది.


Tags:    

Similar News