Tirumala : పది రోజుల్లో తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు
తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. హుండీలో తమకు తోచిన రీతిలో కానుకలను సమర్పిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు. మొత్తం పది రోజుల్లో 6.83 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ద్వార దర్శనానికి...
అయితే ఈ పదిరోజుల్లో హుండీ ఆదాయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. పది రోజుల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం 34.43 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. అంటే రోజుకు మూడు కోట్ల రూపాయలకు పైగానే హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 1.83 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.