Andhra Pradesh : తొలుత మార్కులు 23.. రీ వాల్యుయేషన్ లో 96.. ఇదీ టెన్ట్ ఫలితాల వాల్యుయేషన్
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో వాల్యుయేషన్ లో తప్పులు జరిగాయనడానికి ఇది ఉదాహరణ
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో వాల్యుయేషన్ లో తప్పులు జరిగాయనడానికి ఇది ఉదాహరణ. పేపర్లు వాల్యుయేషన్ చేసినే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినప్పటికీ విద్యార్థులు మాత్రం ఫలితాలు చూసి ఎంత ఆవేదనకు గురయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఒక బాలిక టెన్త్ సబ్జెక్ట్ లో ఫెయిలవ్వగా, రీవాల్యుయేషన్ కు వెళితే 96 మార్కులు వచ్చాయి. బాపట్ల జిల్లా కొల్లూరు జడ్డీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని తేజస్విని తొలుత విడుదల చేసిన ఫలితాల్లో ఐదు సబ్జెక్ట్ లలో తొంభయికి పైగా మార్కులు తెచ్చుకంది.
సోషల్ సబ్జెక్ట్ లో...
అయితే సోషల్ సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడంతో ఆ విద్యార్థి తాను బాగా పరీక్ష రాసినా ఫెయిల్ కావడంతో రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకుంది. అంతకు ముందు ఫెయిలయినప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో 23 మార్కులే తేజస్వినికి రాగా, రీ వాల్యుయేషన్ లో మాత్రం 96 వచ్చాయి. అయితే అప్పటికే ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగియడంతో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆ బాలిక తల్లదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వాల్యుయేషన్ ను ఎంత నిర్లక్ష్యంగా చేశారో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.