Ys Jagan : జగన్ వ్యూహం మార్చింది అందుకేనా? లెక్కలు వర్కఅవుట్ అవుతాయా?

Ys Jagan : జగన్ వ్యూహం మార్చింది అందుకేనా? లెక్కలు వర్కఅవుట్ అవుతాయా?

Update: 2025-08-12 07:03 GMT

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల బరి నుంచి తొలుత వైసీపీ తప్పుకుంటుందన్నప్రచారం జరిగింది.అయితే జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్నారు.ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు తెలిస్తే కడప ప్రజలు ఒకింత పార్టీపై సానుభూతి వ్యక్తం చేస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి.గతంలోనూ కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి చర్యలకే పాల్పడినందున ఆ ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించింది. నాటు వైసీపీనేతలు చేసిన పనికి జిల్లా వ్యాప్తంగా టీడీపీకి పెద్దయెత్తున సానుభూతి కనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లామాత్రమే కాదు..చంద్రబాబు అరెస్ట్,కుప్పం నియోజకవర్గంలో వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికల్లో కనిపించింది.

నాడు జిల్లాలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా...
చిత్తూరు జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే లభించాయి.మిగిలిన వన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. అలాగే కడప జిల్లాలో పదినియోజకవర్గాలుంటే మూడు అసెంబ్లీ సీట్లకే ఫ్యాన్ పార్టీ పరిమితమయింది. మిగిలిన ఏడు స్థానాలను కూటమి గెలుచుకుంది.ఇకరాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్దగా ఫ్యాన్ పార్టీకి సీట్లు లభించలేదు. ఇందుకు ప్రధానంగా అనేక కారణాలున్నప్పటికీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మినహా మిగిలిన చో్ట్ల నాడు అధికారంలో ఉన్న వైసీపీ గెలుచుకుంది. నాడు స్థానిక సంస్థల ఫలితాలో సంతృప్తి పడింది కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి లాభించింది.
అదేరకమైన వ్యూహాన్ని...
ఇప్పుడు అదేరకమైన వ్యూహాన్ని వైఎస్ జగన్ కూడా అవలంబిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. బరి నుంచి తప్పుకుంటే తాము ఓటమికి భయపడి పోటీ నుంచి తప్పుకునట్లవుతుందని, అదే పోటీ చేస్తే వారు పోలీసులతో అధికార దుర్వినియోగానికి దిగడంతో పాటు ఓటర్లను అడ్డుకోవడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను పోలింగ్ కేంద్రాల వద్ద మొహరించడంతో పాటు పోలింగ్ ఏజెంట్లను కూడా వైసీపీని అనుమతించకపోవడంతో భవిష్యత్ లో ఇది తమకు రాజకీయంగా లాభిస్తుందని అంచనా వేసి ఎన్నికల బరిలోకి జగన్ తన పార్టీ అభ్యర్థిని దించినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ వ్యూహం వచ్చే ఎన్నికల్లో ఏవిధమైన ఫలితాలు వస్తాయన్నది తెలియకున్నా, ఎంతో కొంత సానుభూతిమాత్రం వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.


Tags:    

Similar News