రద్దీ తక్కువే : కారణమిదే

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. కేవలం రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు

Update: 2023-09-20 03:21 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని భావించి చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు కనపడుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండలు కిటకిటలలాడతాయి. అందుకే భక్తులు తిరుమల వచ్చేందుకు ఒకింత వెనకడుగు వేస్తారు. వసతి కూడా దొరకదన్న భావనతో స్వామి వారిని తర్వాత దర్శించుకోవచ్చని నిర్ణయించుకుని బ్రహ్మోత్సవాలకు దూరంగా ఉండే వారు అనేక మంది ఉంటారు.

బ్రహ్మోత్సవాల సమయంలో...
తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. కేవలం రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,629 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.58 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది.


Tags:    

Similar News