Tirumala : శనివారం.. ఇంతరద్దీ ఉంటుందని ఊహించలేదే

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.

Update: 2023-11-18 03:43 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడం ఎప్పుడూ జరిగేదే. శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదన్న కారణంతో ఎక్కవ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా భక్తులకు కష్టంగా మారింది. అందుకోసం చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది.

హుండీ ఆదాయం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరణం వరకూ విస్తరించి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులకు టోకెన్లు లేకుండా ప్రవేశించే వారికి శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,140 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,870 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాంయ 4.01 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News