ఆంధ్రప్రదేశ్ లో పొగ మంచు ఎక్కువగా ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేింది. పొగమంచు కారణంగా ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో అనేక విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జాతీయ రహదారిపై ఉదయం తొమ్మిది గంటల వరకూ పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణించే వారికి అలెర్ట్...
వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి వాతావరణశాఖ కీలక సూచనలు జారీ చేసింది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో దట్టంగా పొగమంచు అలుమకుందని, విజిబులిటీ 300 మీటర్లకు పడిపోతుందని వాతావరణశాఖ వెల్లడించింది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ తెలిపింది.