Tirumala : తిరుమలలో ఎంత మాత్రం తగ్గని రద్దీ.. నేడు దర్శనం సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది

Update: 2025-07-23 04:30 GMT

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి ఉండటంతో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలిపిరి టోల్ గేట్ నుంచి ప్రారంభమయిన రద్దీ తిరుమల ఘాట్ రోడ్డులో కూడా కొనసాగుతుందని, వర్షాలు పడుతున్నందున నిదానంగా రావాలని భక్తులకు సూచిస్తున్నారు.

మూడు నెలల నుంచి...
తిరుమలలో గత మూడు నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల వివిధ మార్గాల ద్వారా, వివిధ టోకెన్ల ద్వారా వస్తున్నారు. ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని కొందరు, కాలినడకన మొక్కులు చెల్లించుకునే భక్తులు మరికొందరు, శ్రీవాణి, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులతో కొండ నిండిపోయింది. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద కూడా భక్తుల క్యూ కొనసాగుతుందని, భక్తులకు ఎన్ని లడ్లు కావాలన్నా ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. నారాయణ గిరి షెడ్ల వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,467 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,642 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.42 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News