Tirumala : అలిపిరి నుంచి బారులు తీరిన భక్తులు.. శనివారం ఇంత రద్దీ ఉండటంతో?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వచ్చారు

Update: 2025-04-19 03:18 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వచ్చారు. గత కొంతకాలంగా తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉంది. బయట వరకూ క్యూ లైన్ లు విస్తరించి ఉండటంతో పాటు అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అలిపిరి వద్ద కూడా వాహనాలు గంటల తరబడి తనిఖీల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అలిపిరి వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. తిరుమలకు కూడా అధిక సంఖ్యలో వాహనాలు చేరుకోవడంతో పార్కింగ్ కూడా కష్టంగా మారింది.

నేటి నుంచి జులైనెల కోటా...
తిరుమలలో నేటి నుంచి ఆన్‌లైన్‌లో జూలై కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థఆనం విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జితసేవా టికెట్లువిడుదల చేయనున్నారు. ఈ నెల 22 వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ కోటా టిక్కెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ముందుగానే ప్రకటించారు. 23వ తేదీన అంగప్రదక్షిణం, బ్రేక్‌ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది. 24వ తేదీన జూలై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల చేసిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. జులై నెల కావడంతో భక్తులు కూడా ఎక్కువ మంది తిరుమలకు వచ్చేందుకు ఇష్టపడతారని అధికారుల తెలిపారు
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట వరకూ క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని58,519 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,360 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News