Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కేసులో ట్విస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Update: 2025-02-13 05:16 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ను బెదిరించి, కిడ్నాప్ చేసి అతని చేత అఫడవిట్ ను విత్ డ్రా చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి.

కిడ్పాప్, బెదిరింపుల సెక్షన్లు...
తర్వాత సత్యవర్థన్ కు పది లక్షలు ఇచ్చి విశాఖకు పంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ మేరకు సత్యవర్థన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీ సరిహద్దుల్లో వాహనాన్ని పోలీసులు మార్చారు. సరిహద్దుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీతో పాటు మరో ఐదుగురు ఆయన అనుచరులపై పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. మరి కాసేపట్లో విజయవాడకు వంశీ చేరుకోనున్నారు.


Tags:    

Similar News