పీఆర్సీపై జగన్ అత్యవసర సమావేశం.. ఆ మూడు అంశాలపై?

ఉద్యోగుల సమ్మె సమయం దగ్గరపడే కొద్ది ప్రభుత్వం కొద్దిగా దిగివచ్చే సూచనలు కనపడుతున్నాయి

Update: 2022-01-31 07:57 GMT

ఉద్యోగుల సమ్మె సమయం దగ్గరపడే కొద్ది ప్రభుత్వం కొద్దిగా దిగివచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఉద్యోగులు ప్రధానంగా చెబుతున్న అభ్యంతరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆర్థిక శాఖ అధికారులు చేరుకున్నారు. మంత్రుల కమిటీలో ఉన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు.

వివాదంగా మారిన అంశాలపై....
ప్రధానంగా కీలకంగా మారుతున్న అంశాలపై దృష్టిపెట్టాలని వీరు భావిస్తున్నారు. హెచ్ఆర్ఏ విషయంలో శ్లాబుల్లో సవరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంశంపై కూడా సవరణ చేయాలని, రికవరీ అంశాన్ని కూడా ఈసారికి వత్తిడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మూడు అంశాలకు ఉద్యోగ సంఘాలు ఓకే చెబుతాయని ప్రభుత్వం భావిస్తుంది. వివాదానికి ప్రధాన అంశాలను పరిష‌్కరించాలని జగన్ కు ఆర్థిక శాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది. దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News