Pawan Kalyan : కేబినెట్ భేటీకి పవన్ హాజరు అనుమానమే.
ఈరోజు జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుపై అనుమానాలు ఉన్నాయి
ఈరోజు జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుపై అనుమానాలు ఉన్నాయి. ఆయన జ్వరంతో బాధపడుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. జ్వరం, స్పాండ్ లైటిస్ సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో వైద్యులు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
జ్వరంతో బాధపడుతూ...
దీంతో పవన్ కల్యాణ్ ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా అధికారిక కార్యక్రమాలకు కూడా పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే పవన్ కల్యాణ్ ఈరోజు మంత్రివర్గ సమావేశానికి వస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.