హమాలీలతో భేటీ అయిన కలెక్టర్ – భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పిన వైనం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఎంఎల్ఎస్ పాయింట్ ను సందర్శించారు.

Update: 2025-05-30 11:14 GMT

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఎంఎల్ఎస్ పాయింట్ ను సందర్శించారు. లారీల నుంచి దిగుమతి అవుతున్న బియ్యం బస్తాలను పరిశీలించారు. అదే సమయంలో అక్కడ హమాలీలు తమ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో వారి దగ్గరకు వెళ్లిన కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడారు. భారీ బరువులను ఎత్తుతూ దించుతూ కష్టపడే కార్మికులపై ఆయన ఎంతో ప్రేమను చూపారు.


హమాలీల భుజంపై చేయివేసి వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బాబాయ్.. బాగున్నావా? అంటూ పలకరించారు. ఒక జిల్లా కలెక్టర్ అత్యంత సామాన్యంగా తమ వద్దకు వచ్చి పేర్లు అడిగి మరీ తెలుసుకొని మాట్లాడటంపై హమాలీలు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News