విశాఖలో డబుల్ డెక్కర్ బస్సుల సందడి.. త్వరలోనే!!
విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే పరుగులు తీయనున్నాయి.
విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే పరుగులు తీయనున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మూడు డబుల్ డెక్కర్ బస్సులను నగరానికి తీసుకురానుంది. వీటిలో ఒక బస్సును స్టీల్‌ప్లాంట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సమకూరుస్తుండగా, మిగిలిన రెండు బస్సులను జీవీఎంసీ కొనుగోలు చేయనుంది.
ఈ డబుల్ డెక్కర్ బస్సులను పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలైన సింహాచలం, కైలాసగిరి, తొట్లకొండ వంటి మార్గాల్లో నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు. జూన్ 10వ తేదీ నాటికి కనీసం ఒక బస్సునైనా సిద్ధం చేసి ప్రారంభించాలని జీవీఎంసీ ప్రణాళికలు రచిస్తోంది.