విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళన
విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తంగా మారింది
విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తంగా మారింది. రైతుల ఆందోళనకు దిగడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపేశారు. ఖరీఫ్ ప్రారంభమయి నెల రోజులు దాటుతున్నప్పటికీ ఇంకా యూరియా సరఫరా చేయకపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు. ప్రాధమిక సహకార పరపతి సంఘం వద్ద ఆందోళనకు దిగారు. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు.
గజపతి నగరంలో...
యూరియా వస్తుందని గజపతి నగరం ప్రాధమిక సహకార కేంద్రం వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే అక్కడ యూరియా లేదని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాజకీయ నేతల సిఫార్సులతో కొందరికి మాత్రమే ఇస్తున్నారని, అందరికీ ఇవ్వకుండా తమకు అన్యాయంచేస్తున్నారని ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను చెదరగొట్టారు.