భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గోశాలకు బయల్దేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే టీటీడీ గోశాలకు చేరుకున్న కూటమి నేతలు గోశాలకు భూమన రావాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతల శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై కూటమి, వైసీపీ సవాళ్లు విసరుకుంటున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
హౌస్ అరెస్ట్...
దీంతో ఆయన ఇంటి వద్ద భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతిలో ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశార. నేడు ఎస్వీ గోశాల సందర్శనకు వస్తానని చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. భూమనతో పాటు పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.