మచిలీపట్నంలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యాలయం ర్యాంప్ కూల్చివేత
మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయంలోని ఆక్రమణలను ఉందని అధికారుల కూల్చివేశారు
మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయంలోని ఆక్రమణలను ఉందని అధికారుల కూల్చివేశారు. వైసీపీ ఆఫీస్ ర్యాంప్ ను పగుల గొట్టారు. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు యువత పోరు కు పార్టీ పిలుపు నివ్వడంతో పార్టీ శ్రేణులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ కూల్చివేత జరగడంతో వారు ఆందోళనకుదిగారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని అక్కడకు వచ్చి అధికారులను అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు,పోలీసులు పెద్దసంఖ్యలో వచ్చారు.
పోలీసులకు వ్యతిరేకంగా...
దీంతో అధికారులకు,పేర్నినానికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య వైసీపీ కార్యాలయం ర్యాంప్ ను పగులగొట్టారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ కొల్లు రవీంద్ర పై మండి పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకార పూరితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు నానితో పాటు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు.