వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టెన్షన్ నెలకొంది. కీలక నేతలను అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టెన్షన్ నెలకొంది. కీలక నేతలను అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.పోలింగ్ ప్రారంభమయిన తెల్లవారు జాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలింగ్ కేంద్రాల్లో...
మరొకవైపు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పాటు టీడీపీ నేతలను కూడా కొందరిని గృహనిర్బంధం చేశారు. అయితే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేయడంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.